నిజామాబాద్: జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పట్టణంలో ఉంటున్న రాజు కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రాజుకు ఇద్దరు భార్యలు సంగీత, జ్యోతి. వారికి శిరీష, నిరీష, సాయి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇందులో శిరీష, నిరీష మృతి చెందారు. మిగిలిన నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు వారిని హైదరాబాద్ తరలించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.
A family from Kamareddy of Nizamabad district were tried to suicide today. Two childs dead and four members condition is very critical. They sent to Hyderabad hospital.