వేదిక ఇవ్వకపోతే జైల్లోనే దీక్ష చేస్తా: అన్నా హజారే

నిజానికి అన్నా హజారే ఢిల్లీలో దీక్ష చేయాలని భావించారు. ఎముకలు కొరికే చలి వల్ల తన దీక్షను ముంబైకి మార్చుకున్నారు. ముంబైలో వేదిక ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఆజాద్ మైదాన్‌లో దీక్షకు కూర్చోవాలనే అన్నా హజరేకు మహారాష్ట్ర క్రీడా శాఖ అభ్యంతరం చెప్పింది. మైదానం చెడిపోతుందని శాఖ తెలిపింది. హజారే ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు జైల్ భరో కార్యక్రమాన్ని తలపెట్టారు. జైల్ భరో కార్యక్రమానికి అన్నా టీమ్ రిజిష్టర్ చేసుకుంది.












Click it and Unblock the Notifications