వీరికి బెయిలిస్తే భానును పట్టుకోవడం కష్టం: సిఐడి

సూరి హత్యకు ఆయుధం సమకూర్చింది వీరిద్దరేనని సిఐడి వాదించింది. భాను కిరణ్ సన్నిహితుడు సుబ్బయ్యతో కలిసి సూరి హత్యకు కుట్ర పన్నారని ఆరోపించింది. వారికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని చెప్పింది. సూరిని హత్య చేసిన తర్వాత భాను పారిపోవడానికి సహకారం అందించింది కూడా వీరిద్దరేనని అన్నది. వ్యక్తిగత రక్షణ కోసం ఇచ్చిన ఆయుధాన్ని హత్యకు వాడారని ఆరోపించింది.












Click it and Unblock the Notifications