వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ టిడిపి, కాంగ్రెస్: చేతులు కలిపిన కెసిఆర్, జగన్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR and YS Jagan
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపినట్లుగా మరోసారి వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కెసిఆర్‌కు సహకరించేందుకు జగన్ దాదాపు నిర్ణయించుకున్నారని సమాచారం. తెలంగాణ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే పోటీ కన్నా టిఆర్ఎస్‌తో చేతులు కలపడమే ఉత్తమమని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరి లక్ష్యాలు వేరైనా ఇద్దరి ప్రత్యర్థులు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే కాబట్టి ఆ పార్టీలను దెబ్బతీసేందుకు ఇరువురు అంతర్గతంగా పరస్పర సహకారంతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. విడి విడి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అంతిమంగా సీమాంధ్రలో జగన్, తెలంగాణలో కెసిఆర్ నిలదొక్కుకునే దిశలో వారు ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. పరకాల శాసనసభ్యురాలు, జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యలు కూడా కొంత అనుమానాలకు తావిస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఘంటాపథంగా చెబుతుంటే కొండా సురేఖ మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇంకా గుర్తు రానందున తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశముందని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తే తెలంగాణవాదులు రాష్ట్ర విభజనపై జగన్‌ను ప్రశ్నించే అవకాశముంది. తాను తెలంగాణ కోసమే మొదట రాజీనామా చేశానని సురేఖ చెబుతున్నందున, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలపకుండా ఆమెకు మద్దతు పలికే అవకాశముందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రాంతంతో పాటు ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టి జగన్, కెసిఆర్ పక్కా వ్యూహంతో వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
The roumers were come out that TRS chief K Chandrasekhar Rao alliance with YSR Congress Party chief YS Jaganmohan Reddy in by poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X