ప్రజలకు కిరణ్ కుమార్ రెడ్డి కరెంట్ చార్జీల షాక్

Kiran kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కరెంట్ చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. అన్ని వర్గాలపై కరెంట్ చార్జీల భారాన్ని మోపేందుకు సిద్దపడింది. నెలసరి వాడకం 50 యూనిట్లు దాటితే కరెంట్ షాక్ తగిలినట్లే. 51 - 100 యూనిట్ల మధ్య కరెంటు వాడే మధ్యతరగతి, చిన్న వ్యాపార వర్గాలకు చెందిన 28 లక్షల మందిపై భారం పడుతుంది. వంద యూనిట్ల వరకు నాన్‌ టెలిస్కోపిక్ విధానంలో చార్జీల భారం పడుతుంది. ఆ తర్వాత బిల్లింగ్ టెలిస్కోపిక్‌లో సాగినప్పటికీ యూనిట్‌పై 0.55 పైసల నుంచి రూపాయి వరకు పెంచేశారు.

పారిశ్రామిక వినియోగంపైనా పెంచుతున్నారు. ఆయా కేటగిరీలపై యూనిట్‌కు 41 పైసల నుంచి రూ.1.30 వరకు పెంచాలని ప్రతిపాదించారు. దీంతోపాటు కేటగిరీల మార్పు, పీక్ టైమ్ పొడిగింపు, డిమాండ్ చార్జీల విధింపు వంటివి కూడా చేశారు. మొత్తం మీద విద్యుత్ వినియోగదారుల నుంచి అదనంగా రూ.4950 కోట్లు వసూలు చేసేందుకు డిస్కమ్‌లు రంగం సిద్ధం చేశాయి. బహుశా ఇది రాష్ట్ర విద్యుత్ బోర్డు చరిత్రలోనే అతి భారీ పెంపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+