వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా హజారే మూడు రోజుల నిరాహార దీక్ష ప్రారంభం

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
ముంబై: అటు లోకసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభం కాగా, ఇటు ముంబైలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మూడు రోజుల దీక్షకు దిగారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లుకు డిమాండ్ చేస్తూ ఆయన నిరాహారదీక్షకు దిగారు. అన్నా హజారే మంగళవారం ఉదయం పది గంటలకు జుహు బీచ్‌కు చేరుకుని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధ్యానం చేశారు. అక్కడి నుంచి ఎంఎంఆర్‌డిఎ మైదానానికి అలంకరించిన ట్రక్‌లో బయలుదేరారు. మధ్యలో రమద ఇన్ హోటల్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహానికి అభివాదం చేశారు. ప్రజల వైపు చేతులు ఊపుతూ ఆయన మైదానానికి చేరుకున్నారు.

అన్నా హజారే వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అన్నా ఆరోగ్యం బాగా లేదని కిరణ్ బేడీ కూడా చెప్పారు. తన జట్టు సభ్యులు అర్వింద్ కేజ్రీవాల్, కిరణ్ బేటీ, మనీష్ సిసోడియాలతో కలిసి ఆయన మైదానంలోని వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై, వందేమాతరం వంటి నినాదాలు మిన్నంటాయి. వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు చేసి అన్నా తన దీక్షను ప్రారంభించారు. కాగా, అన్నా దారిలో హై డ్రామా చోటు చేసుకుంది. ఓ 20 మంది ఆయన వాహనానికి అడ్డుగా వచ్చి నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసారు. అన్నా హజారే ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.

ఇదిలా ఉంటే చర్కా మీద పనిచేస్తూ ఘజియాబాద్‌కు చెందిన 79 ఏళ్ల గోపాల్ రాయ్ కింద కూర్చున్నారు. తన పదేళ్ల వయస్సు నుంచి చర్కాను తాను వదిలిపెట్టలేదని ఆయన చెప్పారు. అయితే, న్యూఢిల్లీలో అన్నా దీక్ష కన్నా ఇక్కడి దీక్ష ప్రజల హాజరు తక్కువగా ఉంది. వీధి నాటకాల ప్రదర్శన జరిగింది. పటిష్టమైన జన లోక్‌పాల్ అవసరాన్ని ప్రశాంత్ భూషణ్ వివరించారు.

English summary
The anti-corruption movement leader and social activist Anna Hazare began his three-day hunger strike on Tuesday demanding a stronger version of the ombudsman (Lokpal) bill than the one being debated by Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X