జగన్ దారిలో నడవగలరా?: బాబుకు కొండాసురేఖ ప్రశ్న

టిటిడిపి దొంగ రాజీనామాలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడపలో నిర్వహించిన ప్లీనరీలోనే జై తెలంగాణ నినాదం వినిపించామని, జగన్ తెలంగాణ వ్యతిరేకి కాదన్నారు. అప్పుడు ప్లీనరీలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయమని చెప్పడం ద్వారా జగన్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకున్నారన్నారు. తెలంగాణపై కేంద్రం వేసిన కమిటీలు కాలయాపనకే అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను టిడిపి, కాంగ్రెసు ఏనాడు ఓదార్చలేదన్నారు. వారు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. వారివి కేవలం ఓట్లు, నోట్లు, సీట్లు మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రకటన సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ అనడం తప్ప కాంగ్రెసు చేసిందేమీ లేదు.












Click it and Unblock the Notifications