జగన్ కేసులో పెద్దలు బయటే ఉన్నారు: శంకరరావు

తన నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. 1588 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే దాదాపు వెయ్యి అన్యాక్రాంతమయ్యాయన్నారు. గతంలోని ప్రజాప్రతినిధులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళతానన్నారు. అనర్హుల ఇళ్లను తీసుకొని పేదలకు పంచిపెడతానన్నారు. వెయ్యి ఇళ్లను బిచ్చగాళ్లు, అనాథలు, రిక్షా కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఆయన చేనేత శాఖకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను తన చాంబర్‌లో ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications