విజయమ్మ ఓదార్పు యాత్ర, జగన్‌కు బ్రేకులు పడితే?

జగన్‌ను జనవరిలోనే సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నాయని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జగతి పబ్లికేషన్స్ ఖాతాలను స్తంభింపజేసే అవకాశాలున్నాయని ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. అదే జరిగితే వైయస్ విజయమ్మ పార్టీ పగ్గాలను తన చేతిలోకి తీసుకుని, ఓదార్పు యాత్రను కూడా చేపడతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఒకరు తమతో చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. జగన్ అరెస్టు జరిగితే పార్టీకి మేలే జరుగుతుందనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతున్నట్లు ఆ పత్రిక రాసింది. జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే ప్రచారానికి దాంతో తెర పడుతుందని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాలు తమకేమీ నష్టం కలిగించవని కాంగ్రెసు పార్టీ వర్గాలంటున్నాయి. ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉన్నాయని, అప్పటికి జగన్ ప్రభావం పూర్తిగా తగ్గుతుందని ఆ వర్గాలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీపై, తెలంగాణలో జగన్ ఓదార్పు యాత్రపై మల్లగుల్లాలు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications