సాయిరెడ్డి చిత్రగుప్తుడే, వెనక యమదొంగ:జగన్‌పై ఆనం

Anam Vivekananda Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కేవలం చిత్రగుప్తుడే అని యమదొంగ వేరే ఉన్నారని వైయస్ జగన్‌ను ఉద్దేశించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. ఖూనీలు చేసే ఖూనీకోరుకు, దోపిడీలు చేసే గజదొంగకు, కిరాతకంగా వ్యవహరించే ఉగ్రవాదికి సిద్ధాంతాలు ఉంటాయని, కానీ జగన్ ఆర్థిక నేరాలకు మాత్రం సిద్ధాంతాలు లేవన్నారు. విజయ సాయి రెడ్డి సోకాల్డ్ వైట్ కాలర్ క్రిమినల్ అని, తన మేథాశక్తిని ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఉపయోగించారని ధ్వజమెత్తారు.

ప్రజాధనాన్ని దోచుకునే అక్రమార్కులు ఎప్పటికైనా జైలుకెళ్లడం తప్పదని, జగన్ అక్రమాస్తుల కేసులో సాయి రెడ్డిని సిబిఐ అన్ని ఆధారాలతోనే అరెస్టు చేసిందని అమలాపురం ఎంపీ హర్షకుమార్ అన్నారు. కాంగ్రెసు పార్టీకి ఈ వ్యవహారంతో సంబంధం లేదని, జగనైనా మరెవరైనా అక్రమాలు చేస్తే జైలుకెళ్లడం ఖాయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనేక సిబిఐ దర్యాఫ్తులు జరిగాయని అప్పుడు మంచిదైన సిబిఐ ఇప్పుడు ఎలా చెడ్డదవుతుందని ఎపిఐఐసి చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. స్వచ్ఛంగా ఉన్న వారే ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపాలని సూచించారు. ఉప ఎన్నికలకు, సాయి రెడ్డి అరెస్టుకు ముడి పెట్టవద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+