హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు కార్పోరేటర్‌కు బొత్స బాసట: తిప్పికొట్టిన కిరణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని చేరువ చేసుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిక్యత సంపాదించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన మరో ప్రయత్నం బెడిసిపొట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌ ఎంపికలో చక్రం తిప్పి చిరంజీవిని ఆయన తీప్రవంగా ప్రయత్నాలు చేశారు. పీఆర్పీకి చెందిన ఏకైక కార్పొరేటర్‌ నర్శింహయాదవ్‌కు డిప్యూటీ మేయర్‌ పదవిని కట్టబెట్టడం ద్వారా చిరంజీవిని మరింత దగ్గర చేసుకోవాలని బొత్స ప్రయత్నించినట్లు సమాచారం. అయితే బొత్స సత్యనారాయణ ఎత్తుగడను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిప్పికొట్టారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌ను తెరపైకి తీసుకువచ్చి, ఆయన వర్గానికి చెందిన కార్పొరేటర్‌కు డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టారు. తద్వారా బొత్స సత్యనారాయణ ప్రయత్నాలను ఆయన అడ్డగించారు.

డిప్యూటీ మేయర్‌ ఎంపిక కోసం పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. చిరంజీవి తన పార్టీకి చెందిన కార్పొరేటర్‌ నర్శింహయాదవ్‌కు ఇవ్వాలని సిఫారసు చేశారు. దానికి అంగీకరించిన బొత్స యాదవ్‌కు డిప్యూటీ ఇప్పిస్తానని చిరంజీవికి గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు నాగేందర్‌, ముఖేష్‌, ఇతర నగర నాయకులతో మంతనాలు జరిపారు. చివరకు ముఖ్యమంత్రి కిరణ్‌ వద్దా తన మనోగతం వెల్లడించారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలివిగా వ్యవహరించారు. ఊసే లేని రాజ్‌కుమార్‌ను డిప్యూటీ మేయర్‌ పదవి రేసులోకి తీసుకుని వచ్చారు.

English summary
It is said that CM Kiran kumar Reddy has countered PCC president Botsa Satyanarayana's strategy in deputy mayor selection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X