సిబిఐ విచారణ మీద కాంగ్రెసుపై దుమ్మెత్తిపోసిన జగన్

ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో జగన్‌తో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, శాసనసభ్యుడు పిన్నెల్లి, మాజీ ఎమ్మెల్సీ రెహ్నాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఫీజు ధర్నా జరుగుతోంది. కొన్నిచోట్ల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్దకు భారీగా విద్యార్థులు తరలి వచ్చారు. అక్కడ రోడ్డు ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వారిని బలవంతంగా వాహనం ఎక్కిస్తుండగా ఇద్దరు మహిళలు కింద పడ్డారు.












Click it and Unblock the Notifications