జగన్‌కు కెసిఆర్ చేయి, కొండా సురేఖపై పోటీకి రెడీ

K Chandrasekhar Rao and YS Jaganmohan Reddy
హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అనుకూలంగా వ్యవహరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు పరిస్థితి తిరగబడింది. పోటీ చేయబోమని ప్రకటించిన జగన్ పట్ల తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మొదట్లో కాస్తా సానుకూలంగానే వ్యవహరించారు. దీంతో ఇరువురి మధ్య రహస్య అవగాహన కుదిరిందనే విమర్శలు వచ్చాయి. ఇంతలోనే కెసిఆర్ జగన్‌కు ఎదురు తిరిగారు. తెలంగాణలో జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు సిద్ధపడ్డారు. తెరాసకు స్నేహ హస్తం చాచిన వైయస్ జగన్ వరంగల్లు జిల్లా పరకాలలో తన వర్గం నాయకురాలు కొండా సురేఖకు పోటీ లేకుండా చూసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు తమ పార్టీ పోటీ చేయకపోవడం ద్వారా తర్వాత పరకాలలో జరిగే ఉప ఎన్నికల్లో కొండా సురేఖకు తెరాస మద్దతు పొందాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే, మహబూబ్ నగర్ శాసనసభా స్థానంలో దివంగత శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి భార్యను పోటీకి దించాలని జగన్ ప్రతిపాదించారు.

పరకాల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల విషయంలో జగన్ ప్రతిపాదనకు తెరాస అంగీకారం తెలిపే పరిస్థితే కనిపించింది. కానీ, తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తెరాస అధినేత కెసిఆర్ మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. దీంతో పరకాలలో కొండా సురేఖపై అభ్యర్థిని పోటకి దించుతామని కెసిఆర్ బుధవారం పల్లెబాట ఇంచార్జీల సమావేశంలో చెప్పారు. అలాగే, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా పోటీకి దిగుతామని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రకటించారు. దీన్ని బట్టి కెసిఆర్‌కు, వైయస్ జగన్‌కు మధ్య సయోధ్య బెడిసికొట్టినట్లు భావిస్తున్నారు. జగన్‌ను కూడా సమైక్యవాదిగానే భావిస్తామని తెరాస నాయకులు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. ఈ స్థితిలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జగన్ తలపెట్టిన రైతు దీక్షపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+