జగన్ ఫీజు పోరుకు కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్

ఈ ఏడాది 27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని ముఖ్యమంత్రి చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పా్ర్టీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఒంగోలు ధర్నాలు జగన్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications