కెసిఆర్ ఓ రాక్షసుడు: మోత్కుపల్లి తీవ్రమైన వ్యాఖ్యలు

కాంగ్రెసు పార్టీతో డీల్ కారణంగానే చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని టిఆర్ఎస్, జెఏసి చూస్తోందని కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. బాబు యాత్ర అడ్డుకుంటే మహబూబ్ నగర్ జిల్లాలో కెసిఆర్ ఎలా తిరుగుతారో చూస్తామన్నారు. బాబు యాత్ర అడ్డుకోమన్న వారికి జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు. ఒకరిని ఒకరు అడ్డుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మనుగడ ఉండదని మరో నేత పెద్దిరెడ్డి అన్నారు. జెఏసి చైర్మన్ కోదండరామ్ బాబును అడ్డుకోవాలన్న ప్రకటనను ఉపసంహరించుకోవాలన్నారు. అడ్డుకోవాలని చూస్తే అడ్డు తొలగించుకునే శక్తి టిడిపి కార్యకర్తలకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications