హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంను తప్పించండి: ఆజాద్‌కు ఫిర్యాదుల వెల్లువ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయనను తప్పిస్తేనే పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరుగుతుందని పలువురు ఆజాద్‌తో చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సిఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశారు. హైకమాండ్ పర్యవేక్షణలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పార్టీతో సంబంధం లేని వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఆలాగే చేస్తారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సిఎం కిరణ్‌ను మించిన ఫ్యూడలిస్ట్ మరొకరు లేరన్నారు. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పలువురు ఆజాద్‌ను కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండటం లేదని చెప్పారు.

ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పని చేయడం కష్టమన్నారు. సిఎం పథకాలు ప్రవేశపెట్టే ముందు నాయకులతో మాట్లాడటం లేదని చెప్పారు. గతంలో పథకాలపై చర్చ జరిగినప్పుడు అందరితో మాట్లాడే వారని కాని కిరణ్ మాత్రం ఒక్కడే నిర్ణయం తీసుకుంటున్నారని, పత్రికల్లో వచ్చిన తర్వాతే నాయకులకు తెలుస్తోందని ఆజాద్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి సీట్లు కేటాయించడాన్ని కొందరు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. తెలంగాణ అంశంపై వెంటనే తేల్చాలని పలువురు నేతలు ప్రాంతాలకతీతంగా ఆజాద్ ముందు మొరపెట్టుకున్నట్లుగా సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇలాగే సాగదీస్తే పార్టీకి నష్టమని వారు సూచించారు.

English summary
Congress party leaders complained against CM Kiran Kumar Reddy to central minister Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X