హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేనుండగా ఎవ్వర్నీ చావనివ్వను: ఆజాద్, నో అజెండా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: తాను బతికుండగా ఎవ్వర్నీ చావనివ్వనని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ గురువారం అన్నట్లుగా తెలుస్తోంది. ఆయన గాంధీ భవనంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ డైరీని ఆవిష్కరించారు. అనంతరం కొందరు కాంగ్రెసు సీనియర్ నేతలు ఆజాద్‌ను కలిసి నామినేటెడ్ పదవులపై ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టులు ఇంకా ఎప్పుడు భర్తీ చేస్తారని, మేం చచ్చాక భర్తీ చేస్తారా అన్నారు. దీనికి ఆజాద్ స్పందిస్తూ నేను బతికుండగా ఎవ్వర్నీ చావనివ్వనని అంటూ త్వరలో పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. కాగా సాయంత్రం జరిగే సమావేశానికి ఎలాంటి ప్రత్యేక అజెండా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం, పార్టీకి మధ్య సమన్వయం కోసమే సమావేశమన్నారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది కూడా అందుకేనన్నారు.

కాగా అంతకుముందు ఆజాద్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలతో వేరు వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, ఉప ఎన్నికలపై ఆయన వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆజాద్‌ను కలిసిన వారిలో డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, గీతా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

English summary
Ghulam Nabi Azad make different comments on Congress party senior leaders complaint. Leaders complain to him on nominated posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X