తెలంగాణ యాకూబ్ మీద దాడి ఘటనపై సిబిఐ విచారణ

ఇతనిని పోలీసులు ఆగస్టు 7వ తేదిన అరెస్టు చేశారు. అతనిని పోలీసులు పలు పోలీసు స్టేషన్లు తిప్పి దారుణంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో యాకూబ్ కిడ్నీ, కాళ్లూ పోగొట్టుకున్నాడు. దీనికి స్థానిక డిఎస్పీ కారణమని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణవాదులు పలుమార్లు డిమాండ్ చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదని కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం హర్షదాయకమన్నారు. నాలుగు నెలల క్రితం యాకూబ్ తనను పోలీసులు చిత్రహింసలు పెట్టారని హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications