హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపాలకృష్ణ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Thota Gopalakrishna
హైదరాబాద్: మాజీ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత తోట గోపాలకృష్ణ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గోపాలకృష్ణ రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా, ఒకసారి శాసనసభ్యుడిగా పని చేశారు. 1983, 1985లో తెలుగుదేశం పార్టీ నుండి కాకినాడ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో పెద్దాపురం నుండి కాంగ్రెసు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి. ఆయన గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత మరింత మెరుగైన వైద్యం కోసం ఆయనను కేర్ ఆసుపత్రికి తరలించారు.

కాగా బైపాస్ సర్జరీ సరిగా జరగకపోవడం వల్లనే వల్లనే గోపాలకృష్ణ మృతి చెందారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా గోపాలకృష్ణకు జిల్లాలో మంచి పేరు ఉంది. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేవారని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. గోపాలకృష్ణకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కాగా గోపాలకృష్ణ మృతిపట్ల జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.

English summary
Former MLA, YSR Congress Party leader Thota Gopalakrishna died today in hospital. He won as MLA from Peddapuram in 2004.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X