హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie Commits Suicide
హైదరాబాద్: హైదరాబాదులో 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బరువెక్కుతున్నాననే ఆందోళనకు గురై ఆతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒంటికి నిప్పంటించుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన కె. చంద్రశేఖర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంటెల్లిగ్రూప్‌ మాదాపూర్ శాఖలో పనిచేస్తున్నాడు. అతను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భార్యతో పాటు మియాపూర్‌లోని హేమదుర్గ ప్లాజాలో కాపురం పెట్టాడు. గర్భవతి అయిన అతని భార్య ప్రభావతి నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో అతను ఒక్కడే ఉంటున్నాడు. ఒబిసిటీకి చంద్రశేఖర్ ఆయుర్వేద చికిత్స పొందుతున్నాడు. చికిత్స పనిచేయలేదు.

మంగళవారం రాత్రి పెట్రోల్ బాటిల్‌తో ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పొగలు వస్తుండడంతో ఇరుగు పొరుగువారు కిటికీలో చూసే సరికి మంటల్లో కాలుతూ అతను కనిపించాడని పోలీసులు చెప్పారు. కిటికీలోంచి అతనిపై నీళ్లు పోయడానికి కొందరు ప్రయత్నించారు. తలుపు తెరిచి ఆస్పత్రికి కూడా తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు స్యూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. మతంపై, మహిళలపై కొన్ని అభిప్రాయాలు రాసి ఉన్న కాగితాలు కనిపించాయి.

English summary
A 35-year-old software engineer of Intelligroup who was reportedly depressed for being overweight committed suicide by setting himself ablaze at his house in Miyapur on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X