వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడు ఫీల్డ్‌లోకి రండి: కెసిఆర్, కోదండరాంకు రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
వరంగల్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జెఏసి చైర్మన్ కోదండరామ్ ఎవరూ లేని సమయంలో వచ్చి మాట్లాడటం కాదని ఇప్పుడు ఫీల్డులోకి వచ్చి చూడాలని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం అన్నారు. చంద్రబాబు తన ప్రసంగాలలో ఎప్పుడూ ఎక్కడా కెసిఆర్‌ను విమర్శించిన దాఖలాలే లేవన్నారు. అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో టిడిపిని అడ్డుకోని వాళ్లు ఇప్పుడు అడ్డుకోవడం వెనుక ఉద్దేశ్యమేమిటన్నారు. అడ్డుకోమని గతంలో స్పష్టంగా ప్రకటించి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే అడ్డుకుంటున్నారన్నారు. తాము రైతు సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెసును కాపాడేందుకే అడ్డుకుంటున్నారన్నారు. గతంలో టిడిపికి డిపాజిట్లు రాని మాట నిజమేనని కానీ ఆ తర్వాత బాగా పుంజుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

సంక్రాంతి తర్వాత ఉద్యమం అంటున్న కెసిఆర్‌కు అప్పటి వరకు మంచి ముహూర్తం లేదా అని ప్రశ్నించారు. బాబు తన ప్రాణాలు లెక్కచేయకుండా రైతుల కోసం రెండేళ్ల క్రితం ఎనిమిది రోజులు దీక్ష చేశారన్నారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ప్రజలు హర్షించరన్నారు. కాగా టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదని, స్వాగతం పలుకుతున్న తాము కూడా తెలంగాణవాదులమేనని ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. రాజకీయం కోసమే టిఆర్ఎస్ హడావుడి అన్నారు. అక్కడక్కడ టిఆర్ఎస్ నిరసనలు ఎదురైనా ప్రజల నుండి బాబుకు ఘన స్వాగతం లభించిందని, సాయంత్రం సభతో తమ సత్తా చాటుతామన్నారు.

English summary
TDP MLA Revanth Reddy challenged TRS chief K Chandrasekhar Rao and JAC chairman Kodandaram about attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X