హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌కు చెక్: అమర వీరుల ఐక్య వేదిక అభ్యర్థులు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు చెక్ పెట్టేందుకు మరో వ్యూహం రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో నాలుగు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక తన అభ్యర్థులను ప్రకటించింది. వేదిక నేత రఘుమా రెడ్డి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన శనివారం ఆ ప్రకటన చేశారు. తమ అభ్యర్థులకు మద్దతివ్వాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరాన్ని కోరడానికి వచ్చామని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులుగా మద్దతివ్వాలని, మద్దతివ్వనివారిని తెలంగాణ ద్రోహులుగా పరిగణిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ వేదిక తరఫున ఆదిలాబాద్ నుంచి భూక్యదేవ్ సింగ్, స్టేషన్ ఘనపూర్ నుంచి ఠగూర్ ప్రసాద్, కామారెడ్డి నుంచి ఉప్పలయ్య, కొల్లాపూర్ నుంచి బండారి ఆదిలక్ష్మి పోటీ చేస్తారని ఆయన చెప్పారు.

శానససభా సభ్యత్వాలకు రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరినవారే తిరిగి పోటీ చేసి గెలుస్తే వారు తెరాస శాసనసభ్యులవుతారే గానీ తెలంగాణకు ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన అన్నారు. నాగర్ కర్నూలు నుంచి నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేస్తే మద్దతిస్తామని, వేరేవారు పోటీకి దిగితే తాము పోటీకి దిగుతామని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పోటీకి దిగాలని ఇటీవల మరణించిన టి. రాజేశ్వర రెడ్డి సతీమణిని అడుగుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాదని, తమ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ సెగ ఢిల్లీకి తాకుతుందని ఆయన అన్నారు. తమపై పోటీకి దిగాలని ఆయన సమైక్యవాదులను కోరారు. సమైక్యవాదులు గెలిస్తే తాము తెలంగాణవాదాన్ని వదులుకుంటామని, తాము గెలిస్తే తెలంగాణ ఏర్పాటుకు సమైక్యవాదులు సహకరించాలని ఆయన అన్నారు.

English summary
Telangana martyrs' JAC has announced it candidates for Telangana bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X