వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లొంగిపోయిన సుఖరామ్: జైలుకు పంపిన కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sukhram
న్యూఢిల్లీ: 1993 టెలికం కుంభకోణంలో దోషి టెలికం మాజీ మంత్రి సుఖరామ్ శనివారం పాటియాల హౌస్ కోర్టు ముందు లొంగిపోయారు. ఆయనను కోర్టు జైలుకు పంపింది. కోర్టు ఆదేశాలతో అంబులెన్స్‌లో సుఖరామ్ కోర్టు సముదాయానికి వచ్చారు. ఆయనను కోర్టు అంబులెన్స్‌లోనే జైలుకు పంపించింది. సుఖరామ్ కోమాలో ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. అయితే, ఆస్పత్రిలో ఉన్నప్పుడు సుఖరామ్ ఎప్పుడు కూడా కోమాలో లేరని లజ్జత్ నగర్‌లోని మెట్రో హార్ట్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ వాసి యు ఖాన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఆస్పత్రిలోనే సుఖరామ్ చేరాడు.

సుఖరామ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే సోడియం స్థాయి తక్కువగా ఉండడం వల్ల కాస్తా ఇబ్బంది పడుతున్నారని మెట్రో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైఫ్ డాక్టర్ సందీప్ చత్రత్ చెప్పారు. సుఖరామ్ కోమాలో ఉన్నారని, ఆస్పత్రి నుంచి కదలలేరని ఆయన తరఫు న్యాయవాది శనివారం కూడా చెప్పారు. సుఖరామ్ నిరుడు డిసెంబర్ 31వ తేదీన మెట్రో హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.

English summary
The Patiala House court has ordered Sukhram to be sent to jail in ambulance to serve his three-year sentence. Earlier, Sukhram arrived at the court complex in ambulance following court orders to surrender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X