చంద్రబాబు సహా నేతల అరెస్టు: తోపులాట, ఉద్రిక్తత

Chandrababu Naidu
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై హైదరాబాదులోని విద్యుత్ సౌధా వద్దకు పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ సౌధా వరకు ఆయన పాదయాత్ర తలపెట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3కి రాగానే చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఆయన వెంట ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులను ఎదిరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం నాయకులను పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషనుకు తరలించారు. చంద్రబాబు పాదయాత్రతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. విద్యుత్ సౌధా వద్దకు వస్తే చంద్రబాబును నిలదీస్తామని తెలంగాణ ఉద్యోగులు అంతకు ముందు హెచ్చరించారు. తెలంగాణపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని వారు విమర్సించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి కూడా దిగారు.

పాదయాత్ర ప్రారంభించే ముందు చంద్రబాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపవద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని చెప్పి, మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు లేవని ఆయన అన్నారు. పెరిగిన ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+