కాంగ్రెసులో కొత్త బిచ్చగాడు చిరంజీవి: రోజా వ్యాఖ్య

మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి అనుభవం లేదని రోజా అన్నారు. ఆర్మూరులో వైయస్ జగన్ దీక్ష 8 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన దీక్ష ప్రారంభించాల్సి ఉండగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. ఆర్మూర్ గోల్‌బండ్ల చౌరస్తాలో జగన్ పార్టీ పతాకను ఆవిష్కరించారు. తాను రైతులకు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు పరిహారం సాధిస్తానని ఆయన చెప్పారు. జగన్ దీక్ష మూడు రోజుల పాటు సాగుతుంది. మునిపల్లి వద్ద ఆయన పసుపు పంటను పరిశీలించారు. వ్యవసాయ మంత్రి లేని రాష్ట్రం ఇది అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications