ప్రభుత్వానిది మొద్దు నిద్ర: ఆర్మూర్‌లో దీక్ష చేపట్టిన జగన్

YS Jagan
నిజామాబాద్: రైతులను మరిచిపోయిన ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఈ దీక్ష చేస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన అన్నారు. రైతు, పేద వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆయన అన్నారు. ప్రజల ఆప్యాయతకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన చెప్పారు. దీక్ష ముగింపు సందర్భంలో అన్ని విషయాలు మాట్లాడుతానని ఆయన చెప్పారు. గత రెండేళ్లుగా ఎన్ని దీక్షులు చేస్తున్నా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్సించారు. అంతకు ముందు తెలంగాణ అమర వీరులకు ఆయన నివాళులు అర్పించారు. జగన్ నుదుట శాసనసభ్యురాలు కొండా సురేఖ తిలకం దిద్దారు. వైయస్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన దీక్షను ప్రారంభించారు.

రైతులను పట్టించుకోకపోతే చరిత్రహీనుడివైతావని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారని, చంద్రబాబు రైతులను జైల్లో కూడా పెట్టించారని శాసనసభ్యురాలు కొండా సురేఖ అంతకు ముందు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి రైతులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి భరోసా ఇచ్చారని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో వైయస్ జగన్ దీక్షా శిబిరంలో ఆమె మంగళవారం రాత్రి ప్రసంగించారు. వైయస్ మరణించగానే రైతుల పరిస్థితి మారిపోయిందని, వైయస్ పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని ఆమె అన్నారు. ఎన్ని ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదురైనా రైతులకు అండగా నిలుస్తానని వైయస్ జగన్ దీక్ష చేపట్టారని ఆమె అన్నారు. అడ్డుకోవడానికి ఎంత మంది ప్రయత్నించారని, అయినా ప్రజలు ఆదరించి దీక్షలో కూర్చోబెట్టారని ఆమె అన్నారు.

జగన్ స్వార్థం కోసం దీక్ష చేపట్టలేదని ఆమె అన్నారు. దీక్షను విజయవంతం చేసి ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపి ప్రభుత్వం కళ్లు తెరిచేలా చూడాలని ఆమె అన్నారు. జగన్‌కు అండగా నిలువాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం జవాబుదారీగా లేదని బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. వైయస్ జగన్ దీక్షా శిబిరానికి మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చేరుకుని దీక్షను ప్రారంభించారు. జగన్ సమక్షంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు కేసుపల్లి గంగారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+