పాకిస్తాన్‌లో బాంబు పేలి 29 మంది దుర్మరణం

Pakistan Flag
పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ గిరిజన ప్రాంతంలో మంగళవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఇందులో 29 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. జమ్రుద్ పట్టణంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ బాంబు పేలుడు జరిగింది. ట్రక్కులు, బస్సులు నిలిపి ఉంచే స్థలంలో ఓ ట్రక్కులో దుండగులు బాంబు పెట్టారు. ట్రక్కులో కూర్చున్నవారంతా అక్కడికక్కడే మరణించారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడినవారిని పెషావర్ నగరానికి తరలించారు. జమ్రుద్ పట్టణం పెషావర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఖసాదర్ గిరిజన పోలీసు బలగానికి చెందిన ముగ్గురు సభ్యులు మరణించినట్లు అసిస్టెంట్ పోలీసు ఏజెంట్ జమ్రుద్ మొహ్మద్ జమీల్ ఖాన్ చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడింది తెలియడం లేదు. ఎవరూ దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. తెహ్రీక్ - ఎ - తాలిబాన్ పాకిస్తాన్, పాకిస్తాన్ ప్రభుత్వానికి శాంతి చర్చల వార్తల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+