బాబును చూసి నవ్వుకుంటున్నారు: జగన్ వర్గం ఎమ్మెల్యే

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరులో జగన్ రైతు దీక్షకు విశేష ఆదరణ లభిస్తోందని ఆయన చెప్పారు. దీక్షకు హాజరవుతున్న రైతులను చూస్తుంటే తెలంగాణలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. దాంతో వారు రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రైతు దీక్ష, జగన్ పట్ల ఇంతటి ఆదరణ చూపుతున్న తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే ప్రజల కోరిక తీరుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications