పొలిటికల్ మెగా వార్: చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ

Chiranjeevi-Balakrishna
హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు చిరంజీవి, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ మధ్య రాజకీయ సమరం ముదురుతోంది. సినీ రంగంలో సుతిమెత్తగా, మొహమాటంగా వైరాన్ని వైరంగా కనిపించనీయకుండా పోటీ పడిన ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు రాజకీయాల్లో పరస్పరం ఢీకొట్టుకోవడానికి సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. అసలు సిసలు రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఆరితేరుతున్నారు. ఇటీవల వీరిద్దరు పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి. గతంలో బాలృష్ణ రామ చరణ్‌ తేజను ఉద్దేశించిన వ్యాఖ్యలు వచ్చినప్పుడు చిరంజీవి చాలా సున్నితంగా ప్రతిస్పందించారు. బాలకృష్ణ తనకు మంచి మిత్రుడని, బాలకృష్ణ చెర్రీని ఉద్దేశించి ఆ మాటలు అని ఉండడని చెప్పారు. కానీ ఇటీవలి వ్యాఖ్యలకు మాత్రం చిరంజీవి ఘాటుగా స్పందించారు.

సామాజిక న్యాయం సాధిస్తానని చెప్పిన వ్యక్తి కాంగ్రెసులో పార్టీని విలీనం చేశారని బాలకృష్ణ కృష్ణా జిల్లా పర్యటనలో చిరంజీవిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆయన చిరంజీవిని లక్ష్యం చేసుకున్నాడు. బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి అనూహ్యమైన రీతిలో మాట్లాడలేరు. గతంలోని మొహమాటాన్ని ఆయన వదిలేసినట్లు కనిపించారు. బాలకృష్ణ తనకు స్నేహితుడు అంటూనే బాలకృష్ణవి చిన్న పిల్లాడి మాటలని, చిన్న పిల్లాడి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆ వ్యాఖ్యలపై మాట్లాడడం అనవసరమని చిరంజీవి పొలిటికల్ టచ్ ఇచ్చారు. చిరంజీవి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా మండిపడ్డారు.

చిరంజీవికి బాలకృష్ణపై మాట్లాడే నైతిక హక్కు లేదని తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదన్ అన్నారు. పదవి కోసం కాంగ్రెసు నాయకుల వద్ద చిరంజీవి మోకరిల్లుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, చిరంజీవి మధ్య చోటు చేసుకున్న రాజకీయ వైరం, మాటల యుద్ధం భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశం ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+