చిరంజీవికి కేబినెట్ తిప్పలు, అధిష్టానానికి ఫిర్యాదు!

తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన, అవిశ్వాస తీర్మానంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకున్న చిరంజీవి వర్గం నేతలకు అధిష్టానం రెండు పదవులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిరు ఎవ్వరిని సూచిస్తే వారికి ఇవ్వడానికి అధిష్టానం ఓకె చెప్పింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్య పేర్లను చిరంజీవి సూచించారు. అయితే సి.రామచంద్రయ్యకు పదవి ఇవ్వడాన్ని మాత్రం జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జిల్లా ఎమ్మెల్యే వీర శివా రెడ్డి కూడా అదే చెప్పారు. చిరంజీవి వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించాల్సిందేనని, అయితే రామచంద్రయ్యకు ఇస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పారు.












Click it and Unblock the Notifications