హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెయిల్ కోసం చేతులు జోడించి ప్రాధేయపడిన గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: ఓబుళాపురం గనుల కేసులో అరెస్టైన కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఎదుట చేతులు జోడించి తనకు బెయిల్ ఇవ్వాలని ప్రాదేయపడ్డారు. చంచల్ గూడ జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను సిబిఐ ఉదయం నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు తరలించింది. ఈ సందర్భంగా గాలి తాను విదేశాలకు పారిపోనని, తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని చేతులు జోడించి అడిగారు. రిమాండ్ పొడిగించ వద్దని కోరారు. అదే సమయంలో న్యాయమూర్తి పుట్టిన రోజు వేడుక బాగా జరిగిందా అని ప్రశ్నించారు. బుధవారం గాలి తన పుట్టిన రోజు వేడుకలను జైళ్లో జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా ఛార్జీషీట్ ప్రతులను సిబిఐ కోర్టు గాలికి అందజేసింది. ఓఎంసి కేసును ఈ నెల 25వ తేదికి వాయిదా వేశారు. తాను ఈ నెల 22న మరోసారి బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటానని గాలి చెప్పారు.

మరోవైపు ఓఎంసి కేసులోనే అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైళ్లో తనకు ప్రత్యేక హోదా కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 25వ తేదికి వాయిదా వేసింది. ఆమె రిమాండ్‌ను కూడా 25వ తేది వరకు పొడిగించింది. శ్రీలక్ష్మి అరెస్టై బెయిల్ పొందిన విషయం తెలిసిందే. అయితే ఆమె బెయిల్‌ను సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆమె బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఆమె ఈ నెల 6వ తేదిన సిబిఐ కోర్టు ముందు లొంగిపోయింది.

English summary
Former Minister Gali Janardhan reddy appealed CBI judge for his bail. Court adjourned to 25th of this month hearing in OMC case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X