వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకు పదవి ఇస్తే అభ్యంతరం లేదు, కానీ...: రాయపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambashiva Rao
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన చిరంజీవి వర్గానికి మంత్రి పదవులు ఇస్తే తమకు ఏ విధమైన వ్యతిరేకత లేదని, కానీ పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్నవారిని విస్మరించడం భావ్యం కాదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. పార్టీ అధిష్టానం వైఖరిపై సీనియర్ నేతల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా చిన కాకానిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్లకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదన్న సహచర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు భావనతో తాను ఏకీభవిస్తున్నానని ఆయన చెప్పారు.

తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని, ఈ పరిస్థితిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కొందరు మంత్రులు సహకరించకపోయినా సజావుగా పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ద్వారా మరింత మెరుగ్గా ముందుకు తీసుకుని వెళ్లాలనే ముఖ్యమంత్రి ఆలోచనకు తమ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.

English summary
Congress MP Rayapati Sambashiva Rao said that they are against for posts to Chranjeevi group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X