ప్రత్యూష మృతి కేసు: సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసు

సిద్ధార్థ రెడ్డి కోర్టుకు 50 వేల రూపాయల జరిమానాను చెల్లించారు. సిద్ధార్థ రెడ్డిని హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష కూల్ డ్రింకులో విషం కలుపుకుని సేవించారని, దాని వల్ల ప్రత్యూష మరణించిందని వార్తలు వచ్చాయి. హైకోర్టు తీర్పు తర్వాత లొంగిపోయే వరకు సిద్ధార్థ రెడ్డి బెయిల్‌పై బయటే ఉన్నాడు. 15 రోజుల్లో లొంగిపోవాలని హైకోర్టు సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. అప్పటికే సిద్ధార్థ రెడ్డి 115 రోజులు జైలులో గడిపాడు. హైకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని స్పంధించారు. హైకోర్టులో తమకు న్యాయం జరగలేదని ఆమె అన్నారు. ప్రత్యూష మృతి వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని సరోజినీ చెప్పారు. తమకు హైకోర్టులో న్యాయం జరగలేదని ఆమె అన్నారు. మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. తన కూతురుని చంపినవారికి దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడని అన్నారు.












Click it and Unblock the Notifications