ప్రభుత్వంపై సుప్రీంకోర్టుకెక్కిన ఆర్మీ చీఫ్ వికె సింగ్

తన జన్మతేదీని 1951 మే 10వ తేదీగా మార్చాలని ఆయన రక్షణ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. దాన్ని మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఆయన జన్మతేదీ 1950 మే 10వ తేదీగా నమోదైంది. జన్మ తేదీని మారిస్తే మరో పదేళ్ల పాటు వికె సింగ్ పదవీ కాలం పెరుగుతుంది. తన జన్మ తేదీపై సుప్రీంకోర్టుకు వెళ్లడం అదనపు పదవీ కాలం కోసం కాదని, కేవలం గౌరవం కోసం మాత్రమేనని వికె సింగ్ అంటున్నారు. జన్మ తేదీపై వివాదం నెలకొన్న స్థితిలో తాను గౌరవం పొందడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications