బాలయ్యపై పోటీపై పార్టీదే నిర్ణయం, చర్చిస్తాం: బాబు

జగన్ న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైయస్ జగన్, వైయస్ విజయమ్మలకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని ఆయన అన్నారు. బ్లాక్ మెయిల్ చేసే అలవాటు జగన్‌కే ఉందని ఆయన అన్నారు. కోర్టులను చిన్నచూపు చూడడం తగదని ఆయన అన్నారు. మహానాడులోగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. పార్టీకి సేవ చేసే వారికి పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. పార్టీ సభ్యత్వానికి చంద్రబాబు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో కేవలం ఐదు నిమిషాల్లో పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకునే వారికి గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని ఆయన చెప్పారు.
పాత ప్రాజెక్టులపై సంతకాలు చేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజాసమస్యలను పరిష్కారం చేయడానికి కాంగ్రెసు పార్టీ పనిచేయడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ దూకుడును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. సమర్థులైనవారికి పార్టీలో పెద్ద పీట వేస్తామని ఆయన అన్నారు. ప్రజలే తమ పార్టీని కావాలని అనుకుంటున్నారని, తాము ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొంటామని ఆయన చెప్పారు. ఏ వర్గాలకైనా తమ వల్ల ఇబ్బందులు కలిగితే వారిని కూడా ఆహ్వానిస్తున్నామని, అందరినీ కలుపుకుని సామాజిక న్యాయం కోసం పనిచేస్తామని ఆయన అన్నారు. ఆన్‌లైన్ ద్వారా పార్టీకి విరాళాలు సేకరిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications