హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి: ఢిల్లీలో పంచాయతీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య పంచాయతీ ఢిల్లీకి చేరినట్లు భావిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరపడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు వచ్చిన వెంటనే బొత్స సత్యనారాయణ అప్రమత్తయ్యారు. ముఖ్యమంత్రి కన్నా ముందే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కొలికి పెడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో దానికి బ్రేకులు వేయడానికి బొత్స సత్యనారాయణ ఢిల్లీ చేరుకున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరికి మాత్రమే కాకుండా మొత్తం మంత్రి వర్గ ప్రక్షాళనకు అనుమతి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని కోరాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

తన వ్యూహం ద్వారా బొత్స సత్యనారాయణకు, దామోదర రాజనర్సింహకు తదితరుల దూకుడుకు కళ్లెం వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి వర్గ ప్రక్షాళనకు అనుమతి కోరేందుకు ముఖ్యమంత్రి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అపాయింట్‌మెంట్ కోరినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వ్యూహంలో భాగంగానే ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు మంత్రి పదవిని అడ్డుకోవడానికి కాంగ్రెసు ఎమ్మెల్సీలు అధిష్టానానికి లేఖ రాసినట్లు బొత్స వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా, తనపై కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదులు చేసే అవకాశాలున్నాయని, దాన్ని తిప్పికొట్టడానికి ఢిల్లీలో ఉండడం అవసరమని బొత్స అనుకున్నట్లు చెబుతున్నారు.

కాగా, మంత్రులు, శాసనసభ్యులు ఢిల్లీ దారి పట్టారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, టిజి వెంకటేష్, శానససభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి ఢిల్లీ వెళ్తున్నారు. పలువురు ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. బొత్స, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలపై అధిష్టానం వద్ద పంచాయతీ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

English summary
It is said that CM Kiran kumar Reddy and PCC president Botsa Satyanarayana may put their arguments before party high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X