హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంకు చేతులు జోడిస్తున్నా, ఉపేక్షించొద్దు: శంకర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: తనపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర రావు సోమవారం అన్నారు. తనపై దాడి చేసిన కారకులపై చర్యలు తీసుకోకుంటా ఉపేక్షించడం తగదన్నారు. ఓ దళితుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటే కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి కూడా మంచిది కాదన్నారు. కాంగ్రెసులో తమకు న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు బలహీనవర్గాలు కాంగ్రెసుతోనే ఉన్నాయన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉండటం కంటే బయట ఉంటేనే ప్రజలకు మరింత సేవ చేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కేబినెట్‌లో తన అవసరం లేదనుకుంటే అధిష్టానమే తనను బయటకు పంపిస్తుందన్నారు.

ఎల్బీ నగర్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో తనపై దాడి జరిగిన సంఘటనపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తనపై దాడి జరిగి నెల రోజులు కావొస్తుందని ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.

English summary

 Minister Shankar Rao appealed CM Kiran Kumar Reddy on monday to take action home minister and her son for attacked on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X