సిఎంను కలిసిన వైయస్ వివేకా,చిరంజీవి ఎమ్మెల్యే గీత

YS Vivekananda Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మంత్రి వర్గ విస్తరణ అంశంపై ముఖ్యమంత్రి సాయంత్రం ఢిల్లీ వెళుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి సిఎంను కలవడానికి రావడం చర్చనీయాంశమైంది. చిరంజీవి వర్గంలోని ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకోవడంతో సర్దిపెట్టుకోవాలని అధిష్టానం కిరణ్‌కు సూచించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విస్తరణ కంటే పునర్వ్వవస్థీకరణకు అనుమతి ఇవ్వాలంటూ సిఎం ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కోరే అవకాశముంది. ఆయన చాలారోజులుగా మంత్రివర్గం నుండి అసంతృప్తులను తొలగించి తన అనుకూలురైన వారిని తీసుకోవాలని భావిస్తున్నారు.

పునర్వ్యవస్థీకరణకు అనుమతివ్వాలని అధిష్టానాన్ని కోరేందుకు సిఎం వెళుతున్న సమయంలో వైయస్ వివేకా కలవడం విశేషం. కడప ఉప ఎన్నికలకు ముందు వివేకా వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఉప ఎన్నికల బరిలో వదిన వైయస్ విజయమ్మపై పోటీ చేసేందుకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన శాసనమండలి సభ్యత్వం కూడా ముగిసింది. మరోవైపు సిఎంతో చిరంజీవి వర్గం ఎమ్మెల్యే వంగా గీత, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ, మంత్రులు బస్వరాజు సారయ్య, మహీధర్ రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, చీప్ విప్ కొండ్రు మురళి తదితరులు భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+