రేపు చిరు వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవులు

ప్రజారాజ్యం ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, శానససభ్యుడు గంటా శ్రీనివాసరావులను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి రేపు గురువారం మంత్రి వర్గ విస్తరణ జరుగనుంది. మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాటు చేయాలని సాధారణ పరిపాలనా శాఖకు ఆదేశాలు అందాయి. కాంగ్రెసుకు చెందినవారికి ఈసారి మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవని దీన్ని బట్టి అర్థమవుతోంది. కాగా, జౌళి శాఖ మంత్రి పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి తప్పించడానికి ముఖ్యమంత్రి అధిష్టానం ఆమోదం పొందినట్లు తెలుస్తోంది. ఎంత మంది వ్యతిరేకించినా చిరంజీవికి ఇచ్చిన మాటను గౌరవించి సి. రామచంద్రయ్యను మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఇష్టానిష్టాలకు అధిష్టానం తావు ఇవ్వకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆలోచించినట్లు అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications