జగన్ సాక్షి డైలీ వాణిజ్య ప్రకటనలపై సిబిఐ ఆరా

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికకు ప్రభుత్వం విడుదల చేసిన వాణిజ్య ప్రకటనలపై సిబిఐ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సాక్షి దినపత్రికకు ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలను విడుదల చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని సాక్షి డైలీకి ప్రకటనల రూపంలో ధారపోసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి సిబిఐ పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో భాగంగా సాక్షి పత్రికకు ప్రభుత్వపరంగా సమకూరిన ప్రయోజనాలను సిబిఐ పరిగణనలోకి తీసుకున్నట్లు ఓ పత్రిక రాసింది. సాక్షి దినపత్రికకు ఏ ప్రాతిపదికతో ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసింది, వాటి జారీలో ఎవరి ప్రమేయం ఏ మేరకు ఉంది, సాక్షికి కేటాయింపుల తీరెలా ఉంది, అప్పటి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులపై ఏ మేరకు ఒత్తిళ్లు పని చేశాయి, తదితర అంశాలపైనా సిబిఐ విచారణ చేపట్టినట్లు వార్తలు వచ్చాయి.

ఓ ప్రముఖ పత్రిక వార్తాకథనం ప్రకారం - సాక్షికి ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వం 2008 ఏప్రిల్ 24న ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) ధ్రువీకరణ పత్రం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 18 నెలలకు ప్రకటనలు జారీ చేయాలనే నిబంధనను పక్కన పెట్టి సాక్షికి ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వైయస్ హయాంలో పత్రికలవారీగా ఇచ్చిన ప్రకటనల వివరాలను సిబిఐ సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి సేకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+