హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విస్తరణ కొలిక్కి: చిరుకు రెండు, తెలంగాణకు మూడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ముందు తన వాదనను బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఉన్నారు. సోనియాతో చర్చల తర్వాత గులాం నబీ ఆజాద్, కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వెళ్లిపోగా, ఆ తర్వాత సోనియా గాంధీ అహ్మద్ పటేల్‌తో చర్చలు కొనసాగించినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరితో పాటు మరింత మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని, కొంత మందికి ఉద్వాసన చెప్పాలని ముఖ్యమంత్రి వాదిస్తూ వస్తున్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చిరు వర్గానికి చెందిన ఇద్దరికి, తెలంగాణకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కసరత్తు పూర్తయినట్లు చెబుతున్నారు. శంకరరావుకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు రాజీనామాలు చేయడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఈ స్థితిలో ఖాళీల్లో తెలంగాణ మంత్రులను తీసుకోకుండా చిరంజీవి వర్గానికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కిరణ్ కుమార్ రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. అలాగే, వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామా వల్ల వ్యవసాయ శాఖకు మంత్రి లేకుండా పోయారు. కొంత మంది మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్తవారిని తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకుండా చిరంజీవి వర్గానికి మంత్రి పదవులు ఇవ్వడం సరి కాదని అంటున్నారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో అధిష్టానం ఏకీభవించినట్లు చెబుతున్నారు.

సోనియాతో సమావేశం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గానీ, ఆజాద్ గానీ మీడియాతో మాట్లాడలేదు. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కన్నా ముందే మంగళవారం సాయంత్రం ఆజాద్‌ను కలిశారు. ఆజాద్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీన్ని బట్టి అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that CM Kiran kumar Reddy talks with Sonia Gandhi concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X