టిడిపిని అధికారంలోకి తెస్తాం!: హరికృష్ణ, జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, దివంగత నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని హీరో జూనియర్ ఎన్టీఆర్ బుధవారం అన్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. బుధవారం ఎన్టీఆర్ పదహారవ వర్ధంతి. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, తనయులు హరికృష్ణ, రామకృష్ణ, అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర రావు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్ మనవడిగా పుట్టడం తన అదృష్టమన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఆయన మనవడిగా ఆయన స్థాపించిన పార్టీ కోసం మనసారా పని చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చెప్పారు. ఆయనలా పేదల కోసం పని చేసిన వారెవరు లేరన్నారు.

కాగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 2009 సాధారణ ఎన్నికల్లో టిడిపి తరఫున విస్తృత ప్రచారం చేసిన జూ.ఎన్టీఆర్, ఇటీవల టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కుమార్ రాజకీయ ఆరంగేట్రం వ్యవహారం కారణంగా టిడిపికి క్రమంగా దూరమయ్యారనే వార్తలు వచ్చాయి. హరికృష్ణ కూడా బాబుపై మళ్లీ అలకబూనారన్న వార్తలు వినిపించాయి. కానీ బుధవారం టిడిపి బలోపేతానికి కృషి చేస్తానని హరికృష్ణ, ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని జూ.ఎన్టీఆర్ అనడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+