21 నుంచి తెలంగాణలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర

వైయస్ జగన్ ఈ నెల 21వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో అడుగు పెడుతున్నారు. ఓదార్పు యాత్రను చేపట్టడానికి గల అవకాశాలపై తద్వారా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రను ముగించుకుని ఆయన ప్రఖ్యాత జహంగీర్ పీర్ దర్గాలో ప్రార్థనలు చేసి ఆ తర్వాత పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై జగన్ అంతకు ముదు మహబూబ్ నగర్ జిల్లాలో ఆందోళన చేపట్టాలని అనుకున్నారు. అయితే, దాన్ని విరమించుకున్నారు. తెలంగాణ సెంటిమెంటు తక్కువగా ఉండడంతో కొత్తూరు జహంగీర్ పీర్ దర్గాను ఆయన సందర్శించనున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications