హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కస్టమ్స్ అదుపులో మంత్రి, ఎమ్మెల్యే తనయులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shamshabad Air Port
హైదరాబాద్: కస్టమ్స్ అధికారుల అదుపులో నలుగురు ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విదేశాల నుండి అక్రమంగా వస్తువుల రవాణా చేస్తున్నారని తెలుసుకున్న కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వ్యూహంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా సుమారు యాభై లక్షల రూపాయల విలువైన దుబాయ్ వస్తువులు తీసుకు వస్తుండగా పట్టుకున్నారని సమాచారం.

అధికారులు పట్టుకున్న వారిలో ఓ మంత్రి తనయుడు, శేరిలింగపల్లి ఎమ్మెల్యే భిక్షపతి తనయుడు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు, మెదక్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడి తనయుడు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా వారిని డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు వారిని విడిపించేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే కస్టమ్స్ డ్యూటీ పే చేస్తే వదిలి పెట్టే అవకాశముంది.

English summary
Minister son and MLA son under customs officers for illegal transport from Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X