కేబినెట్ నుండి శంకర రావు ఔట్? మల్లుకు అవకాశం

Shankar Rao
న్యూఢిల్లీ: మంత్రివర్గం నుండి చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర్ రావును తొలగించనున్నారనేప్రచారం జోరుగా జరుగుతోంది. మంత్రివర్గంలో ఉంటూనే సహచర మంత్రులు, ముఖ్యమంత్రిపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్న శంకర రావుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనను కేబినెట్ నుండి తప్పించాలని సిఎం కోరినట్లుగా సమాచారం. ఉదయం కిరణ్ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న శంకర రావును తప్పించాలని కోరారనే వాదనలు వినిపిస్తున్నాయి. శంకర రావును తప్పిస్తే ఆయన స్థానంలో మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతమున్న మంత్రివర్గంలో తెలంగాణ వారి వాటా పదహారు. జూపల్లి, కోమటిరెడ్డిలు రాజీనామా చేయడంతో ప్రస్తుతం అది పద్నాలుగుగా ఉంది. శంకర రావును తప్పిస్తే తెలంగాణ నుండి ముగ్గురిని కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. గండ్ర వెంకట రమణా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో తెలంగాణ వాటా పూర్తి చేయాలని సిఎం భావిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు పిఆర్పీ నుండి చిరంజీవి సూచించిన సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు దాదాపు ఖరారైనట్లే. కాసు కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, సునీత లక్ష్మా రెడ్డిల పదవులకు కూడా ముప్పు ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సిఎం కోరినట్లు పునర్వ్యవస్థీకరణకు అనుమతిస్తే తేనేతుట్టెని కదిపినట్లే అవుతుందని అందుకే పిఆర్పీ వర్గంతో పాటు మరో మూడు నాలుగుంటికే అధిష్టానం ఛాన్స్ ఇస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+