హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాకు తెలిసే వైయస్ దోపిడి చేశారు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలిసే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో దోపిడికీ పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు. రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించారు. ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు వారి గుండెల్లో ఉన్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటితే కాంగ్రెసు నేతలు మాత్రం ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు.

ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తామన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారం కోసమే పుట్టిన పార్టీ అన్నారు. అధికారంలోకి రాగానే శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరును ఎన్టీఆర్ పేరు మీద మారుస్తామన్నారు. ముందుంది మరింత మంచి కాలం అంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరెంత కాలం ఉంటాడో చెప్పలేమన్నారు. పదవుల విషయమై రెండు రోజులకోసారి ఢిల్లీ వెళుతున్నారన్నారు. పోలవరం టెండర్లను రాజాంకు కట్టబెట్టేందుకు సిఎం ప్రయత్నించారన్నారు. పోలవరం టెండర్ల విషయంలో టిఆర్ఎస్ పాత్ర ఉందన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu accused that AICC president Sonia Gandhi know about late YS Rajasekhar Reddy illegal activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X