హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంతో చిరంజీవి భేటీ, శాఖల కేటాయింపుపై తర్జనభర్జన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య, శాసనసభ్యుడు గంటా శ్రీనివాస్ రావులకు కేటాయించవలసిన శాఖలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. ఉదయం చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రాధాన్యత ఉన్న శాఖలు కేటాయించాలని చిరంజీవి వర్గం పట్టుబడుతుండగా, రాజీనామాలు చేసిన మంత్రుల శాఖలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. విద్యుత్, కమర్షియల్ ట్యాక్స్ శాఖల కోసం పిఆర్పీ వర్గాలు పట్టుబడుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వ్యవసాయం, ఓడరేవులు మౌలిక సదుపాయలు తదితర శాఖలు ఇవ్వాలని సిఎం యోచిస్తున్నారట.

ఇదే విషయమై చిరంజీవి, సిఎంల మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తీవ్ర తర్జనభర్జనల తర్వాత ఇరువురి మధ్య శాఖల కేటాయింపుపై ఓ స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. కిరణ్‌తో శాఖలపై స్పష్టత వచ్చిన అనంతరం చిరంజీవి సి.రామచంద్రయ్యతో భేటీ అయ్యారు. సిఎం ఇస్తానన్న శాఖలపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. శాఖల వివరాలు రాత్రి లేదా శుక్రవారం అధికారికంగా తెలిసే అవకాశముంది.

English summary
Tirupati MLA Chiranjeevi met CM Kiran Kumar Reddy and talk about cabinet posts to his camp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X