వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్‌తో సిఎం భేటీ, అక్కడే నమస్తే తెలంగాణ రాజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi Map
న్యూఢిల్లీ: నమస్తే తెలంగాణ పత్రిక యజమాని రాజం కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ నివాసంలో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బుధవారం ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం వేడి పుట్టించిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ఆజాద్ నివాసంలో రాజం ప్రత్యక్షం కావడం గమనార్హం. బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్ నివాసానికి వెళ్లడానికి ముందే రాజం అక్కడ ప్రత్యక్షమయ్యారట. ఆ తర్వాత కొద్దిసేపటికి సిఎం వచ్చారు. సిఎం, ఆజాద్ సుమారు గంటన్నర పాటు చర్చించుకున్నారు. ఆ సమయంలో రాజం అదే ప్రాంగణంలో ఉన్నారు. ఆ తర్వాత ఆజాద్, కిరణ్ కలిసి ఒకే వాహనంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. అయితే వారు వెళ్లిన కాసేపటికి గానీ రాజం ఆజాద్ నివాసం నుండి బయటకు రాలేదు.

సిఎం, ఆజాద్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే రాజం అదే ప్రాంగణంలో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అదీ పోలవరం టెండర్లను ఉన్నత స్థాయి కమిటీ ఖరారు చేయబోతున్న నేపథ్యంలో ప్రత్యక్షం కావడం గమనార్హం. దీంతో ముఖ్యమంత్రి, అధిష్టానం మధ్య చర్చలు మంత్రివర్గ విస్తరణకే పరిమితమయ్యాయా? లేక ఇతర అంశాలేమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ రాజం భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కాగా రాజంతో పాటు టెండర్ వేసిన మరో నేత కూడా పార్టీ పెద్దలతో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

English summary
Namasthe Telangana Rajam found at central minister Ghulam Nabi Azad's residence when CM Kiran Kumar Reddy met Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X