హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రిగా శంకర రావు తొలగింపు, గవర్నర్‌కు సిఎం లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: మంత్రివర్గం నుండి శంకర రావును తొలగించారు. గురువారం మధ్యాహ్నం శంకర రావును తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. కాగా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పటి నుండి శంకర రావును తొలగిస్తారనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. మరికొందరు మంత్రుల పేర్లు వినిపించినప్పటికీ శంకర రావు పేరే ప్రముఖంగా వినిపించింది. అందరూ ఊహించినట్లుగానే ఆయనను తొలగించేందుకు అధిష్టానం సిఎంకు అనుమతి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే సిఎం శంకర రావును తన మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తున్నట్లు గురువారం చిరంజీవి వర్గం నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనంతరం సిఎం గవర్నర్‌కు లేఖ రాశారు. గవర్నర్ దానిని ఆమోదించారు. శంకర రావును తప్పిస్తున్నట్లు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

కాగా అంతకుముందు శంకర రావు చిరంజీవి వర్గం నేతల మంత్రి పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను వచ్చే వారం ఢిల్లీ వెళతానని చెప్పారు. తన రాజీనామాను గవర్నర్ నరసింహన్‌కు ఇవ్వనని, నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలో సోనియా గాంధీకే ఇస్తానని చెప్పారు. తనను కేబినెట్ నుండి తొలగిస్తున్నట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు.

English summary
Minister Shankar Rao removed from cabinet today. CM Kiran Kumar Reddy wrote letter to governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X