ఉండవల్లి ఊసరవెల్లి, అప్పుడే నిలదీశాం: రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై ఆరోపణలు చేసిన తన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు చేయడంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను ఆయన ఊసరవెల్లిలా అభివర్ణించారు. అవినీతిపై పోరాటమంటే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగాలను అనువాదం చేయడమంత సులభం కాదని ఆయన ఉండవల్లిని ఉద్దేశించి అన్నారు. బతికుండగానే వైయస్ అవినీతిపై తాము పోరాటం చేశామని, కావాలంటే శాసనసభ రికార్డులను ఉండవల్లి పరిశీలించుకోవచ్చునని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం వేసి, అందరికీ పంచామని ఆయన గుర్తు చేశారు.

జాతీయ నేతల ప్రసంగాలను అనువాదం చేయడానికి, వైయస్సార్ తందనా కొట్టడానికి మాత్రమే పరిమితమైన ఉండవల్లి అరుణ్ కుమార్ స్థానిక అభివృద్ధికి పనిచేయలేదని ఆయన విమర్సించారు. కెవిపి రామచందర్ రావును కూడా సిబిఐ విచారణకు పిలిచిందని, కెవిపిలాగే ఉండవల్లి వైయస్ రాజశేఖర రెడ్డి కోసం పనిచేశారని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనులపై, సెజ్‌లో రూపంలో భూములను కబ్జా చేసిన విషయంపై, ఇతర అవినీతిపై తాము నిరంతరంగా పోరాటం చేశామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+